మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్నాథ్ ప్రాంతంలో సోమవారం ఉదయం స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. స్కూల్ బస్సు రివర్స్ టర్న్ తీసుకుంటుండగా బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది పాఠశాల విద్యార్థులు ఉన్నారు. చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు చిన్నారులను కాపాడారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.