కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లో డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ పేరుతో సోమవారం నూతన పార్టీని ప్రకటించారు. కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పలువురు నేతలు, పార్టీలతో సంప్రదింపులు జరిపిన మీదట నెలరోజుల తర్వాత ఆజాద్ కొత్త పార్టీతో ప్రజల ముందుకొచ్చారు. తమ పార్టీ స్వతంత్ర ఆలోచనలు, సిద్ధాంతాలతో ప్రజాస్వామిక పునాదులపై వేళ్లూనుకుంటుందని చెప్పారు.