డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. పోలీసులు 90 రోజుల్లో ఛార్జ్‌షీట్ వేయలేదని, బెయిల్ మంజూరు చేయాలని అనంతబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, హైకోర్టు దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు.