ఝూర్ఖండ్ పాలమూ ప్రాంతంలోని సాత్బర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం దారుణం జరిగింది. నివసించే బాధితురాలు భర్తపై అలిగి పుట్టింటికి బయల్దేరింది. ఆమె వెంటే భర్త బ్రతిమిలాడుతూ వెళ్లాడు. బాధితురాలి బావ కూడా వచ్చి ఆమెకు నచ్చజెప్పాడు. ఇంతలో ఆరుగురు దుండగులు వచ్చి బాధితురాలి బావను స్పృహ తప్పేలా కొట్టారు. ఆపై భర్త కళ్ల ముందే భార్యపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.