పొద్దుటూరు మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో కౌన్సిలర్ అలవలపాటి అరుణాదేవి, వైసీపీ నాయకుడు కాకర్ల నాగశేషారెడ్ది ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పాల్గొని వార్డులో గల ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటూ, జగనన్న ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలతో మాట్లాడుతూ వార్డులో పర్యటించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీముని పల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, భవన గృహ నిర్మాణ సొసైటీ బ్యాంకు చైర్మన్ గోపిరెడ్డి రమణయ్య, కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, వైసీపీ మహిళ నాయకులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.