హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. కొండచరియలు విరిగిపడటంతో బాధితులంతా నిద్రలోనే సజీవ సమాధి అయ్యారు. 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అపార నష్టం వాటిల్లింది. ఆ రాష్ట్రంలో 120 రోడ్లు మూసుకుపోయి. 90 చోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి.