సంబేపల్లె మండల పరిధిలోని దేవర రాయి నల్లగంగమ్మ తల్లికి రాయచోటి కి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి గంగిశెట్టి, ఉపాధ్యాయుడు ఉమామహేశ్వర్ దంపతులు 80 గ్రాముల వెండి ముఖ కవచాన్ని మంగళవారం బహుకరించారు. దాతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, దుశ్శాలువలుతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త మరియు ధర్మకర్తల మండలి చైర్మన్ మునగా మురళీ స్వామి, ఈఓ కొండారెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.