చీరాల ప్రసాద్ థియేటర్ సమీపంలో ఒక బాలుడి మెడలో నుంచి బంగారు చైను తెంపుకుపోయిన ఆగంతుకుడి చిత్రం సీసీటీవీ ఫుటేజ్ లో లభ్యమైంది. ఆదివారం రాత్రి మోహన మణి అనే బాలుడిని స్కూటీపై వచ్చిన ఒక వ్యక్తి ఆపి టైమ్ అడిగినట్లే అడిగి అతడి మెడలో నుండి పదహారు గ్రాముల బంగారు చైన్ ను తెంపుకుపోవడమే తెలిసిందే.
దీంతో వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ప్రసాద్ థియేటర్ సమీపంలోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించగా మణి తో ఒక వ్యక్తి మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. అతడే చైన్ స్నాచర్ అని నిర్ధారించుకున్న పోలీసులు మంగళవారం సీసీటీవీ ఫుటేజ్ ను మీడియాకు విడుదల చేశారు. అతడి ఎవరికైనా తారసపడినా, వివరాలు తెలిసినా తమకు తెలియజేయాలని వన్‌టౌన్ సీఐ మల్లికార్జునరావు ప్రజలను కోరారు.