ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 21 వ వార్డు నందు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నమస్తే మార్కాపురం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కలగడ్డ మార్కాపురం పట్టణ మల్లికార్జున, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణ, టిడిపి మార్కాపురం పట్టణ అధ్యక్షులు డాక్టర్ షేక్ మౌలాలిపాల్గొన్నారు.