దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రుల్లో భాగంగా నేడు 2వ రోజు. అశ్వీయుజ శుద్ద విదియ. నేడు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు. లేత గులాబీ రంగు వస్త్రంతో అమ్మను అలంకరించాలి. బంగారు రంగు అనుకూల శక్తి తీసుకు వస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని చిద్రాన్నం అని కూడా అంటారు. దీన్ని ద్వార సకల దోషాలు పోతాయని పండితులు చెబుతారు.