కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాల నిధులతోనే ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిని అభివృద్ధి చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మంగళవారం స్థానిక మిద్దె సెంటర్లో జరిగిన ప్రజాపోరు కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర నిధులపై చర్చకు రావాలని ఎమ్మెల్యే ఆర్కేకు సవాల్ విసిరారు. ఎయిమ్స్ హాస్పిటల్కి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని సోము మండిపడ్డారు.