గుంటూరు: పిట్టవానిపాలెం మండలం, చందోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భగళాముఖి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం రెండో రోజు అమ్మవారు పార్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి పట్టుచీర, ఆభరణాలతో అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.