వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి , వైయస్సార్ పేరు పెట్టడం సబబు కాదని మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. గాంధీనగర్ లో ని ప్రెస్ క్లబ్ లో మంగళవారం అయన మీడియా తో మాట్లాడుతూ ఎన్టీఆర్ తో తనకు ఉన్న అబుబంధం కారణంగా ప్రస్తుతం ఉన్న మూడు పదవులకు రాజీనామా చేసినట్లు స్ఫష్టం చేశారు. అదే రోజు రాజీనామా పాత్రలు అధికారులకు పంపడం జరిగిందన్నారు. నిన్నటి రోజున ఒక దినపత్రికలో స్వరం మార్చిన యార్లగడ్డ అని వార్త పై ఆయన స్ఫష్టత నిచ్చారు.
ఆ పత్రిక యజమాన్యానికి స్వరం మార్చలేదు, రాజీనామా పై వెనక్కి తగ్గేది లేదని లేఖ పంపడం జరిగిందన్నారు. భాషాభివృద్ధికి పదవే అవసరం లేదు పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తానని పెర్కొన్నారు. సిఎం జగన్ మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను. పేరు మార్చడం నచ్చలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చేసా నని పెర్కొన్నారు. రాజీనామా పై వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు