ఇంద్రకీలాద్రి పై కొలువైన జగన్మాత దుర్గమ్మను ఏపీ శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఏర్పాట్లు చేశారు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అహర్నిశలు సీఎం శ్రమిస్తున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డికి శక్తిని ప్రసాదించి…అండగా నిలవాలని అమ్మను ప్రార్ధించా రాష్ట్రం ప్రజలను, సీఎం జగన్ మోహన్ రెడ్డిని చల్లగా చూడాలని వేడుకున్నాం వర్షాలు సమృద్ధిగా పడి…పాడి పంటలు బాగా వృద్ధి చెందేలా అమ్మ కృపాకటాక్షాలుండాలని ఆకాంక్షిస్తున్నా అని ఆయన అన్నారు.