సోషల్ మీడియాలో రీల్స్ చేస్తోందని ఓ వ్యక్తి తన భార్యను చంపేశాడు. ఈ ఘటన బీహార్ లోని భోజ్పుర్లో జరిగింది. అన్నూ, అనిల్ పదేళ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అన్నూ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. అలా చేయడం అనిల్ కు నచ్చలేదు. వద్దని చెప్పినా అన్నూ రీల్స్ చేయడంతో గొడవలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి కూడా వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనిల్ భార్యను గొంతు నులిమి హత్యచేశాడు.