ఏపీలో అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలను అమలు చేయనున్నారు. గ్రామ/వార్డు సచివాయాల ద్వారా అప్లై చేసుకోవాలి. పెళ్లి నాటికి వధువుకు 18, వరుడికి 21 ఏళ్లు నిండాలి. వధువు, వరుడు టెన్త్ పాసవ్వాలి. వారి కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలలోపు ఉండాలి. 3 ఎకరాలకు మించి మాగాణి, పదెకరాలకు మించి మెట్టభూమి ఉండరాదు. మెట్ట, మాగాణి కలిపి పదెకరాలలోపు ఉండొచ్చు.