ఏపీలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి వైఎస్సార్ కల్యాణమస్తు, మైనార్టీలకు షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీల వివాహాలకు రూ.లక్ష, ఎస్టీ, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహాలకు రూ.75 వేలు, మైనార్టీలకు రూ.లక్ష, దివ్యాంగులకు రూ.1.50 లక్షలు, భవన నిర్మాణ కార్మికులకు రూ.40 వేలు అందించనుంది.