కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కాఫీలో ఉండే న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి. ఒక టేబుల్‌స్పూన్ కాఫీపౌడర్‌లో ఒక టీస్పూన్ తేనె, నాలుగైదు చుక్కలు విటమిన్ ఇ ఆయిల్ వేసి కళ్ల కింద రాయాలి. పావుగంట తరువాత కడిగేసుకోవాలి. మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి కాఫీ సహాయపడుతుంది. మూడు టేబుల్‌స్పూన్ల కాఫీ పొడి, రెండు టేబుల్‌స్పూన్ల షుగర్, మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరినూనెను కలిపి మిశ్రమంలా చేసి ముఖం నెమ్మదిగా రబ్ చేయాలి. పది నిమిషాల తరువాత శుభ్రంగా కడగాలి.
కాఫీ మాస్క్‌ను ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, మచ్చలు తొలగిపోయి నిగారింపు సంతరించుకుంటుంది. కాఫీ పౌడర్, కోకా పౌడర్‌ను ఒక బౌల్‌లో తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్టులా చేయాలి. తరువాత రెండు చుక్కల తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఒక బౌల్‌లో కొద్దిగా కాఫీ పొడి తీసుకుని అందులో 3 టేబుల్‌స్పూన్ల అలోవెరా జెల్ వేసి ముఖంపై నెమ్మదిగా స్క్రబ్ చేయాలి. పదినిమిషాల తరువాత కడిగేసుకోవాలి. చర్మం సహజసిద్ధమైన మెరుపు సంతరించుకోవడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది.