వరల్డ్ టూరిజం డే 2022 వేడుకలను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్దిలో భాగంగా విజిట్ ఆంధ్రప్రదేశ్ - 2023 క్యాంపెయిన్‌ను సీఎం ప్రారంభించి, అనంతరం క్యాంపెయిన్ బ్రోచర్ల ఆవిష్కరించారు. రాష్ట్రంలో సులువుగా పర్యాటక ప్రదేశాలను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన జీఐఎస్ వెబ్‌పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.
పర్యాటక అభివృద్దిలో కీలకపాత్ర పోషిస్తూ టూరిజం, ట్రావెల్, ఆతిధ్య రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచాలని ఈ సందర్బంగా అధికారులకు సీఎం సూచించారు. ఈ సందర్భంగా అరకు నుంచి వచ్చిన గిరిజన థింసా నృత్య కళాకారులతో సీఎం ముచ్చటించారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ స్సెషల్ సీఎస్ డాక్టర్ రజత్ భార్గవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.