అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ హరజనవాడలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ విషయాన్ని అక్కడ గ్రామ ప్రజలు జిల్లా పరిషత్ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఫోన్ ద్వారా మంగళవారం తెలియజేశారు. ఆయన వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి సమస్య తెలుసుకొని మీకు నీరు అందించే బాధ్యత నాది అని గ్రామస్తులకు భరోసా ఇవ్వడం జరిగింది.ఆయన వెంట రాజంపేట జడ్పిటిసి దాసరి పెంచలయ్య, బ్రాహ్మణపల్లి సర్పంచ్ మౌలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రవీంద్ర, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాజేష్ నాయక్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట నియోజకవర్గం బూత్ కమిటీ మేనేజర్ పిల్లి మారుతి తదితరులు ఉన్నారు.