చిన్నమండెం మండల పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం వైయస్సార్ చెక్కును మహిళలకు మాజీ జెడ్ పి వైస్ ఛైర్మన్ దేవనాథ్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, దేవనాథ్ రెడ్డి లు అందజేశారు. వాళ్ళు మాట్లాడుతూ మహిళలు కష్టాలు పడకూడదని, ప్రతి మహిళ ఎదో ఒక్క వ్యాపారము చేసుకోని తన పిల్లలను చదివించుకునేలా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయం అన్నారు. చిన్నమండెం మండలంలో 3వ విడత వైయస్సార్ చేయూత చెక్కులను 1747 మందికి 3. 28 లక్షలు పంపిణీ చేశారని పేర్కొన్నారు.