జిల్లాలోని 25 మండలాల ఎంపిడిఒలు వారి మండలాల పరిధిలో స్పందన అర్జీలు నూరు శాతం పరిష్కరించాలని జూమ్ సమీక్షలో జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. అర్జీదారునికి స్పందన సెల్ నుండి నేరుగా ఫోన్ చేసి మీ సమస్య పరిష్కారం అయిందా లేదా అని అడుగుతున్నారని అన్నారు. నా సమస్య పరిష్కారం కాలేదని ఒక్కరు కూడా చెప్పడానికి వీలు లేకుండా ఎంపిడిఓలు బాధ్యతతో పని చేయాలని కోరారు. ఒక్క అర్జీ పెండింగ్ లో పెట్టినా సదరు ఎంపిడిఒ పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.