చిత్తూరు: పుత్తూరు పరిస్థితి వరుస దొంగతనాలు పుత్తూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. మొన్న పట్టణ నడిబొడ్డున, నిన్న పట్టణ శివారు కాలనీలో దొంగతనాలు జరిగాయి. దీనితో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పుత్తూరు పట్టణంలోని తిరుపతి రోడ్డు , స్వర్ణ లే అవుట్ నందు సోమవారం రాత్రి దొంగలు హల్ చల్ చేశారు. జెసిబి ఓనర్ అయినటువంటి హరిచంద్ర ప్రసాద్ ఇంట్లో దొంగలు 50 వేల రూపాయలు విలువగల టీవీ , 1/2 కేజీ వెండి దీపాలు చోరీ అయినట్లు తెలిపారు. గతంలో కూడా ఈ స్వర్ణ లేఔట్ నందు దొంగతనం జరిగినట్లు అక్కడ ఉన్న స్థానికులు తెలిపారు.
ప్రతి మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి ఇక్కడ చోరీలు సర్వసాధారణమై పోయాయి. ఈ లేఔట్ కు ఇటు ప్రక్క పట్టణంలో కి వచ్చే రోడ్డు అటు ప్రక్క చెన్నై- తిరుపతి బైపాస్ రోడ్డు ఉంది. దీనితో దొంగలు సులభంగా తప్పించు కుంటున్నారు. అందులోనూ ఈ కాలనీ పట్టణం బైట ఉంది. పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. అంతేకాకుండా పట్టణంలో అక్కడక్కడ చిన్నచిన్న దొంగతనాలు జరుగుతున్నాయి. గత వారంలో పట్టణ నడి బొడ్డు లో కె. ఎన్. రోడ్డులోని హరి ఫార్మసీ నందు షాప్ షట్టర్ పగలగొట్టి 40 వేల రూపాయలు నగదు చోరీ చేసిన సంగతి పట్టణంలో అందరికీ తెలిసిందే. ఇకపోతే, స్వర్ణ లేఔట్ ఎదురుగా ఉన్న శ్రీనివాస నగర్ లో 2018లో 11 లక్షల రూపాయల దొంగతనం కూడా ఇంతవరకు రికవరీ కాలేదు. ప్రమీలమ్మ ఇంట్లో 38 సవరాల బంగారు, అరకేజీ వెండి చోరీ జరిగింది. పోలీసులు చుట్టూ తిరిగి తిరిగి భాదితులు మిన్నకుండిపోయారు. ఇకనైనా పోలీసుల అప్రమత్తమై దొంగతనాలు జరగకుండా చూడాలని , పోలీసు వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.