ఏపీ సీఎం జగన్ మంగళవారం పశు సంవర్ధక శాఖపై సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛమైన పాల ఉత్పత్తి కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆర్గానిక్ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలని ఆదేశించారు. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టులను భర్తీని పూర్తి చేయాలని, ప్రతి ఆర్బీకేలో ఈ పోస్టులుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైయస్సార్ చేయూత, ఆసరా ద్వారా కొనుగోలు చేసిన పశువులన్నింటికీ బీమా సదుపాయం కల్పించాలన్నారు.