వేమూరు నియోజకవర్గం చావలి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త సోమరౌతు వీరస్వామి కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై సర్జరీ నిమిత్తం హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఈ రోజు హాస్పిటల్ కి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది . మరియు డాక్టర్ గారితో మాట్లాడి మెరుగైన వైద్యం ఇప్పించాలని కోరడం జరిగింది. వైద్యానికి కావలసిన సొమ్ములో కొంత మేర ఇచ్చి ఆదుకుంటానని హామీ ఇచ్చారు.