కృష్ణా జిల్లా ప్రధానంగా నది పరివాహక ప్రాంతమని , నీటి నిల్వలు ఉన్నచోటనే నాగరికతలు వెల్లివిరుస్తాయని , ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే పర్యాటకం ప్రధాన భూమిక పోషిస్తుందని కృష్ణాజిల్లా కలెక్టర్ పి . రంజిత్ బాషా తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని కృష్ణాజిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పర్యాటకంపై పునరాలోచన మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో మంగళవారం చేపట్టిన ‘ సాగరతీర స్వచ్ఛత - బీచ్ క్లీనింగ్ ’ కార్యక్రమం విజయవంతమైంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య కొనసాగిన కార్యక్రమంలో కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల గార్లతో పాటు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు , విద్యార్థులు , పౌరులు , మచిలీపట్నం నగర పాలక సంస్థ ఉద్యోగులు దాదాపు 500 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంగినపూడి బీచ్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకొని , వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పర్యాటకం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల జిల్లా పర్యటనలో తనకు సూచించినట్లు చెప్పారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగినపూడి బీచ్ నందు జిల్లా పర్యటన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బీచ్ స్వచ్ఛత'లో కార్యక్రమంలో భాగంగా పలు రకాల క్రీడా పోటీలు ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఆథారిటీ అధికారులు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా అధికారులు సరదాగా వాలీబాల్ ఆడినారు . ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ మరియు పర్యాటక శాఖ ఇంచార్జ్ అధికారి ముదిగొండ ఫణి ధూర్జటి గారు , జిల్లా రెవిన్యూ అధికారి ఎం . వెంకటేశ్వర్లుగారు , డి . ఎస్ . పి . మాసూమ్ బాషాగారు , వివిధ శాఖల జిల్లా అధికారులు , పలు విద్యా సంస్థల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.