ప్రభుత్వ పథకాలపై ప్రజలకు సమర్థవంతమైన ప్రచారం నిర్వహించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కర్నూలులో సమాచార శాఖ రూపొందించిన స్వర్ణాంధ్ర@2047 క్యాలెండర్‌ను కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిడిడిపి, తలసరి ఆదాయం పెంపు కోసం శాఖలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, రైతుల ఆదాయం పెరగడానికి వ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa