తిరుపతి నగరంలో బుధవారం ఉదయం నుండి జోరు వాన కురిసింది. చాలా రోజులుగా ఎండ వేడితో అల్లాడిపోయిన నగరవాసులకు వర్షం రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణం లభించింది. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏటా వర్షాలు కురుస్తాయని, అది శుభ సూచికమని మరికొందరు అంటున్నారు. వర్షం కారణంగా రోడ్లు అన్ని జలమయమైయ్యాయి. మ్యాన్ హోల్ నుంచి మురుగు నీరు పొంగి పోర్లుతుంది.