భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. పాదయాత్రలో ఆయనను బుధవారం కలిసిన ఓ యువతి సంతోషం పట్టలేకపోయింది. ఆనందంతో గంతులు వేసింది. ఆ తర్వాత రాహుల్ కలిసిన సందర్భంలో కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఉత్సాహాన్ని చూసి రాహుల్ గాంధీ నవ్వుకున్నారు. ఏడుస్తున్న ఆమెను సముదాయించారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి, కాంగ్రెస్ నేతలు ట్విట్టర్లో పెట్టగా బాగా వైరల్ అవుతోంది.