ఏపీ సీఎం జగన్ బుధవారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఈ పరిశ్రమతో 1000 ఉద్యోగాలొస్తాయి. సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే ఎకరాకు ఏడాదికి రూ.30 వేలు లీజు ఇస్తాం. మూడేళ్లకోసారి 5% లీజు పెంచుతాం. కనీసం 2వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలి. రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి' అని అన్నారు.