హోం వర్క్ చేయమంటే చాలా మంది చిన్నారులు ఇష్టపడరు. ఆడుకునేందుకు వెళ్లమంటే సంతోషంగా వెళ్లిపోతారు. ఇదే కోవలో హోం వర్క్ చేస్తున్న బాలుడు తన అవస్థలను తల్లి ముందు ఏకరవు పెట్టాడు. హోం వర్క్ చేస్తూనే ముసలోడిని అయిపోతానని, పిచ్చి మమ్మీ అని తల్లితో అన్నాడు. తన కుమారుడి రియాక్షన్స్‌ను సలోని అగర్వాల్ అనే మహిళ వీడియో తీసి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టగా బాగా వైరల్ అవుతోంది. ఆ బాలుడి అవస్థలు, చెప్పిన మాటలు విని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.