ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం దర్శించుకున్నారు. మంత్రికి ఆలయ మర్యాదలతో దుర్గగుడి ఈవో భ్రమరాంబ, కలెక్టర్ ఢిల్లీ రావు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనం అనంతరం మంత్రికి వేద ఆశీర్వచనంతో పాటు ప్రసాదాలను అందచేశారు. దుర్గమ్మను దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అందరినీ చల్లగా చూడాలని దుర్గమ్మను కోరుకున్నానని మంత్రి తెలిపారు.