రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ మంగళవారం నుంచి పర్యటిస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం కడప జిల్లాలోని ముఖ్యమంత్రి ప్రాతినిత్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం, వేంపల్లిలో తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి మూడు రాజధానులపై ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు ఎవరూ కూడా మూడు రాజధానులకు అనుకూలంగా లేరని, ఏకైక రాజధాని అమరావతినే కోరుకుంటున్నారని ప్రజలు తమ అభిప్రాయం తెలియజేశారన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రజలు మూడు రాజధానులను కోరుకోవడం లేదని బీవీ రామ్ అన్నారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తను వచ్చే నెల రెండో తేదీన విశాఖలో నిర్వహించే బహిరంగ సభకు హాజరు కావాలన్నారు. ఇదిలా ఉండగా వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని బి. వి. రామ్ సందర్శించి నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి సమాధి ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఇలా ఉండగా పులివెందుల పర్యటనకు ముందు బి. వి. రామ్ రాయచోటిలో కూడా పర్యటించారు. రాయచోటిలో కూడా ప్రజలు ఏకైక రాజధాని అమరావతి నే కోరుకుంటున్నారు తప్పా. మూడు రాజధానులు కాదని తెలిపారు. అలాగే రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు వారి పూర్తి మద్దతు ప్రకటించారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి. వి. రామ్ అన్నారు. అనంతరం అక్కడ ప్రజలు రామ్ కు ఆత్మీయ సత్కారం శాలువతో సత్కరించారు. అంతకుముందు మంగళవారం సాయంత్రం ఒంటిమిట్టలోని శ్రీరామచంద్రమూర్తిని బి. వి. రామ్ దర్శించుకుని పూజలు చేశారు.