కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఉచిత రేషన్ పంపిణీ గడువును మరో 3 నెలలు పొడిగించింది. దీనిపై బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన రానుంది. ఈ నిర్ణయంతో కేంద్రంపై రూ.45 వేల కోట్ల భారం పడనుంది. తాజా నిర్ణయంతో ఈ ఏడాది చివరి వరకు ఉచిత రేషన్ పంపిణీ కొనసాగనుంది.