కదిరి పట్టణంలో సంవత్సరాల నుండి విట్రాక్ మరియు ఏ టి డి కంపెనీలకు లేబర్ లైసెన్స్ లేదని కనీస వేతనాలు ఇవ్వడం లేదని బుధవారం ఆర్ ఎస్ వై ఎఫ్ ఏ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ పిఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సదుపాయాలు కల్పించకుండా పనులు చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వ సెలవు దినాలలో కూడా సెలవు ఇవ్వకుండా కంపెనీ యాజమాన్యం పని చేయిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కు తెలిపారు.