భారతమాత ముద్దుబిడ్డ విప్లవ యోధుడు భగత్ సింగ్ నేటి యువ తకు స్ఫూర్తి దాతని డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు అన్నారు. బుధవారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115 వ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండు కూడలిలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సురేంద్ర, పట్టణ ఉపాధ్యక్షులు ప్రతాప్, సహాయ కార్యదర్శి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.