నార్పల మండలంలోని గంగనపల్లి, గూగూడు గ్రామాలలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను బుధవారం డీపీఓ ఆకస్మిక తనిఖీ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యదర్శులకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్యం పనులు మెరుగు పరచాలని తెలిపారు. చెత్త దిబ్బలు, మురికి నీరు పారడం గాని ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.