ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు లేని పేదలు ఉండరాదని సదుద్దేశంతో జగనన్న కాలనీల ద్వారా అర్హులందరికీ ఇల్లు నిర్మించి ఇస్తున్నారని పురపాలక చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. బుధవారం పులివెందుల పట్టణంలోని రాజీవ్ కాలనీ వద్ద నూతనంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ నిర్మాణానికి చైర్మన్, మున్సిపల్ కమిషనర్ వి. వి. నరసింహారెడ్డితో కలసి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ క్రిష్ణారెడ్డి, వైవిపి నాయకులు సోపాల వీర, హౌసింగ్ ఏఈ సంజీవరాయుడు, అమినేటి సెక్రటరీ మహేష్, తదితరులు పాల్గొన్నారు.