బాపట్ల జిల్లా ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు కారంచేడు, యద్దనపూడి మహిళా ఎస్సైలు అనిత, రత్నకుమారి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారి భరతం పడుతున్నారు. విధి నిర్వహణలో వారు పురుష ఎస్ఐలతో పోటీ పడుతున్నారు. వారు నైట్ పెట్రోలింగ్ చేస్తూ మారుమూల ప్రదేశాల్లో కూడా తిరుగుతూ బహిరంగ ప్రదేశాల్లో ఎవరు మద్యం సేవిస్తూ కనిపించినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు. అవసరమైతే జరిమానాలు విధిస్తున్నారు.