ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన స్థానిక కవి రచయిత, జాతీయ సాహిత్య రత్న అవార్డ్ గ్రహీత గొట్టిముక్కుల నాసరయ్య బుధవారం గుఱ్ఱం జాషువా 127 వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా
ముంతాజ్ మహల్ ని చూపించినా, ఫిరదౌసీని పలకరించినా, గబ్బిలంతో బాతాఖానీ కొట్టినా , ఆతని మనసులో మెదిలేది.. కదిలేది.. కష్టజీవి కష్టం అని అన్నారు.
భావాలను గుఱ్ఱంలా పరుగెత్తించి, చదువరుల మెదళ్ళను ఆలోచనలవైపు మళ్ళింపజేసిన జాషువా.. దళితులు, కష్షజీవులే శ్వాసగా నిశ్వాసగా ప్రాణంగా జీవితంగా అవపోశన పట్టినవాడు జాషువా అని గుర్తుచేశారు. జాలు వార్చిన ప్రతీ సిరా చుక్కలో కష్ట జీవి రక్తాన్ని.. చెమటను ప్రతిఫలింపజేసినాడు జాషువా. బాల్యంలో ఎదుర్కున్న చీత్కారాలనే అందుకున్నాడు సత్కారాలుగా. సాహిత్య లోకంలో అండ పిండ బ్రహ్మాండంగా ఎదిగి తొడిగించుకున్నాడు గండపెండేరాలు. నిమ్నజాతి అని ఈషడించిన వారి ముందే నమోన్నతంగా ఎదిగి పద్మవిభూషణుడయ్యాడు. కవితలను కొత్త పుంతలు తొక్కించి నవయుగ కవి చక్రవర్తిగా కీర్తించబడ్డాడు జాషువా అని కొనియాడారు.