జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద మార్టూరు మండలంలో గత ఏడాది నాటిన మొక్కలు ఎండిపోవడంపై జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మండిపడ్డారు. బుధవారం ఈ పథకం క్రింద పనుల పురోగతి పై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మార్టూరు మండలం లో మొక్కలు ఎండిపోవడంపై అధికారుల సంజాయిషీ కోరారు. నిర్వహణ లోపం వల్లే ఇలా జరిగిందన్నారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను వారంలో నాటాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.