కంభం పట్టణంలోని రెడ్డి ఫ్యాన్సీ షాపులో నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్పెషల్ ఎంఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లక్ష 6వేల రూపాయలు విలువ చేసే నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నట్టు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులు నిలువ ఉంచిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్ లో వీటి విలువ మరింత ఎక్కువ ఉంటుందని తెలిపారు.