తమిళనాడు సీఎం స్టాలిన్ తనదైన శైలిలో ప్రజల మన్ననలని పొందుతున్నాడు. తాజాగా ... నకిలీ పత్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను రద్దు చేసే అధికారం స్టాలిన్ తీసుకొచ్చినారు. ఈ చట్టం ద్వారా ఎంతో మంది తమ భూములని పొందవచ్చని ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. ఇందులో భాగంగా సినీ నటి వాణిశ్రీ స్థలం 11 ఏళ్ల క్రితం కబ్జాకు గురైనది అని తెలుసుకున్న స్టాలిన్,తిరిగి ఆమెకు అప్పగించారు. ఇదే క్రమంలో మొత్తం ఐదుగురి భూములను కబ్జాదారుల చెర నుంచి ప్రభుత్వం విడిపించింది. ఈ సందర్భంగా స్టాలిన్ చల్లగా ఉండాలి అని వాణిశ్రీ ఆశీర్వదించింది.