సీఎం జగన్ ఉత్తరాంధ్ర కి అన్యాయం చేసారు అని టీడీపీ నాయకులూ అచ్చేమ్ నాయుడు మాట్లాడిన మాటలకి స్పందిస్తూ.. ఉత్తరాంధ్రకు 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని స్పీకర్, వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. గత మూడేళ్లలో తాము ఏం చేశామో చర్చకు సిద్ధమని టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ్మినేని సీతారాం సవాల్ విసిరారు. ఈ చర్చకు అచ్చెన్నాయుడి లాంటి పానకంలో పుడకలు వద్దన్నారు. డైరెక్టుగా చంద్రబాబుకే సవాల్ విసురుతున్నట్లు తమ్మినేని తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గుడ్డిగా విమర్శిస్తున్న వారికి అభివృద్ధి ఏం కనిపిస్తుందని సెటైర్లు వేశారు. ఎన్నికల్లో ప్రజలు తీర్పునిస్తారని.. ఎవరు ఎలాంటివారో అప్పుడు అచ్చెన్నాయుడికి దద్దమ్మలెవరో తెలుస్తుందని కౌంటర్ ఇచ్చారు.