రైతు సంక్షేమానికి పెద్దపీట వేయాలని, వ్యవసాయం చేసే రైతు సుభిక్షంగా ఉండాలనే దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రం వేమూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయం చేసే రైతుకు నాణ్యమైన విత్తనాలతో పాటు, ఎరువులు కూడా సరసమైన ధరలకు అందించాలని దిశగా పని చేస్తుందన్నారు.