విశాఖపట్నం: రేబాక గ్రామానికి చెందిన ఎస్.ఉపేంద్ర ఎమోపోలియోతో బాధపడుతున్నాడు. ఇతనికి ప్రభుత్వం ప్రతి నెలారూ.10 వేలు పింఛన్ ఇస్తోంది. ఉపేంద్రకు ఇటీవలె చెన్నైలోఒక ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్లో అడ్మిషన్ లభించింది. పది రోజుల క్రితమే ఉపేంద్ర కళాశాలలో చేరేందుకు చెన్నై వెళ్లాడు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఏప్రిల్ నెలపింఛన్ సొమ్ము పదివేల రూపాయలను స్థానిక వలంటీరు సాదిరెడ్డి శేఖర్ ఆదివారం తీసుకెళ్లి ఉపేంద్రకు అందజేశాడు.