తూర్పు గోదావరి, రాజోలు: మామిడికుదురు మండలం మగటపల్లిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి వాతావరణం బాగానే ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయానికి భారీగా మేఘాలు కమ్ముకుని సుమారు రెండు గంటల పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై గుంతలలోకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa