వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించటమే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 2023 మార్చి నాటికి 100 శాతం వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు 41 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. విద్యుత్ రాయితీ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాకే ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.