టీ20వరల్డ్ కప్ కు అంతా సిద్ధమవుతున్న వేళ ఇండియా టీమ్ నుంచి బుమ్రా దూరం అయినట్లు తెలుస్తోంది. వెన్ను ఫ్రాక్చర్ గాయం కారణంగా బుమ్రా టీ20 వరల్డ్ కప్ నుంచి దూరమయ్యాడు. ఈ గాయానికి సర్జరీ అవసరం లేకున్నా.. 4-6 నెలల విశ్రాంతి తప్పనిసరి అని డాక్టర్లు సూచించారు. ఈ సమయంలో బుమ్రా ఎలాంటి ప్రయాణాలు చేయొద్దు. దీంతో ఆక్టోబర్ 16 నుంచి జరిగే వరల్డ్ కప్ కి బుమ్రా అందుబాటులో ఉండడని స్పష్టమవుతోంది. దీనిపై బీసిసీఐ స్పందించాల్సి ఉంది.