చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల బాత్ రూం వీడియోల లీక్ ఘటన మరవకముందే యూపీలోని కాన్పూర్ లో మరో ఘటన వెలుగుచూసింది. తాము స్నానం చేస్తుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియోలు తీశాడని ఓ ప్రైవేట్ హాస్టల్ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ సీజ్ చేసి, విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.